రాజమౌళి అంటే ఒక బ్రాండ్. మొదటి సినిమా నుంచి తన కష్టాన్ని నమ్ముకొని రికార్డులను తిరగరాస్తూ ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. తన సినిమాలో ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. అనవసరమైన సీన్స్ కనిపించవు. రాజమౌళి డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంత పర్ఫెక్ట్ గా ఆయన ఒక సన్నివేశాన్ని ఎలా డిజైన్ చేస్తాడు? తన సక్సెస్ ల వెనుక దాగివున్న సీక్రెట్ ఏంటి? వర్క్ షాప్స్ & హ్యాండీ క్యామ్స్ తో షూట్. ఒక సన్నివేశాన్ని చిత్రీకరించేటప్పుడు ఆయన ఒకటికి పది సార్లు దానికి రిహార్సల్స్ చేసుకుంటాడు. ఒకసారి స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక తన డైరెక్షన్ టీమ్ ను పెట్టుకొని వర్క్ షాప్ కండక్ట్ చేస్తూ హ్యాండిక్యామ్ కెమెరాతో షూట్ చేస్తాడు. దీనివల్ల ఆ సన్నివేశంలో ఎలాంటి కెమెరా యాంగిల్స్ వాడాలి, ఆర్టిస్టులు ఎక్కడ నిలబడాలనే విషయంలో క్లారిటీ వస్తుంది. ఇలా చేయడం వల్ల సెట్ కి వెళ్ళాక ఎలాంటి గందరగోళం ఉండదు. ఆర్టిస్టులు సెట్ లోకి అడుగుపెట్టగానే రాజమౌళి తనే స్వయంగా ఆ సీన్స్ లో నటించి చూపిస్తాడు. ఇలా ప్రతి సన్నివేశం తెరకెక్కించడానికి ముందు ఒకటి రెండు సార్లు రిహార్సల్స్ చేసి చూసుకోవడం మంచి పద్ధతి.